షఫాలీ వర్మ అరుదైన ఘనత

6 Mar, 2020 20:05 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం, డాషింగ్‌ ఓపెనర్‌ షఫాలీ వర్మ అరుదైన ఛాన్స్‌ కొట్టేసింది. అనతి కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న షఫాలీ వర్మను ప్రముఖ శీతల పానీయాల సంస్థ 'పెప్సీ' తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. టీ 20 ప్రపంచకప్‌ ప్రదర్శనతో షఫాలీ వర్మ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో  పలు కంపెనీలు ఆమెకు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమయ్యాయి.
(ఆసీస్‌ పేసర్‌కు షఫాలీ భయం!)

ఈ నేపథ్యంలోనే షఫాలీ వర్మతో పెప్సీ ఒక సంవత్సరం పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ బ్రాండ్‌తో షఫాలీ కి ఇదే తొలి ఒప్పందం.ఒక ఐకానిక్‌ బ్రాండ్‌ పెప్సీతో ఒప్పందం చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మంచి పేరున్న బ్రాండ్‌ 'పెప్సీ'తో అనుబంధం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్ధం కావట్లేదు. మహిళలు తమ జీవితానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇది మా కాళ్లపై మేం నిలబడాల్సిన తరుణం' అని షఫాలీ వర్మ అరుదైన ఘనతవర్మ పేర్కొంది.  ప్రపంచకప్‌ ఫైనల్లోనూ షఫాలీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మార్చి 8(ఆదివారం) జరిగే పైనల్లో  టీమిండియా  ఆస్ట్రేలియాతో తుది పోరుకు సిద్ధమైంది.

గతేడాది సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 16 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం షఫాలీ వర్మ ఆరు నెలల కాలంలోనే ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు చేసి 172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక టీ20 మ్యాచ్‌లలో 146.96 స్ట్రైక్ రేట్‌తో 485 పరుగులు చేసింది.
(నంబర్‌ 1 బ్యాటర్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్‌ ట్వీట్‌!)

మరిన్ని వార్తలు