పాకిస్థాన్ టి20 కెప్టెన్ గా ఆఫ్రిది

16 Sep, 2014 15:37 IST|Sakshi
పాకిస్థాన్ టి20 కెప్టెన్ గా ఆఫ్రిది

లాహోర్: పాకిస్థాన్ టి20 కెప్టెన్ గా డాషింగ్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది నియమితులయ్యాడు. 2016లో జరగనున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ వరకు అతడు కెప్టెన్ గా కొనసాగుతాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. కోచ్ వకార్ యూనిస్, క్రికెట్ బోర్డుతో గొడవ కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన మూడేళ్ల తర్వాత టీమ్ నాయకత్వ పగ్గాలు అతడికి అప్పగించడం విశేషం.

మహ్మద్ హఫీజ్ కెప్టెన్సీ వదులుకోవడంతో ఆఫ్రిదికి అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మొదటి రౌండ్ నుంచి వెనుదిరగడంతో హఫీజ్ కెప్టెన్సీ వదులుకున్నాడు. కాగా మిస్బా-వుల్-హక్ కు ఊరట లభించింది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు అతడు టెస్టు, వన్డే కెప్టెన్ గా కొనసాగుతాడని పీసీబీ ప్రకటించింది.

మరిన్ని వార్తలు