ఆఫ్రిది విధ్వంసం; బంగ్లాపై పాక్ గెలుపు

4 Mar, 2014 22:59 IST|Sakshi
ఆఫ్రిది విధ్వంసం; బంగ్లాపై పాక్ గెలుపు

మిర్పూర్: ఆసియాకప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో పాకిస్థాన్ ఛేధించిన అత్యధిక లక్ష్యం ఇదే కావడం విశేషం. ఈ విజయంతో పాక్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది.

డాషింగ్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది విధ్వంసకర ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 18 బంతుల్లోనే 2 ఫోర్లు 6 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు. 59 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ అద్భుతంగా ఆడి సెంచరీ కొట్టాడు. షెహజాద్103 పరుగులు చేశారు. మహ్మద్ హఫీజ్(52), ఫావద్ ఆలాం(74) అర్థసెంచరీలతో తమ వంతు పాత్ర పోషించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కేయిస్(59), మమినల్ హక్(51), ముష్పిఖర్ రహీమ్(51) అర్థ సెంచరీలు సాధించారు. షకీబ్ ఆల్ హసన్ 44 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు