ఆఫ్రిది ఆల్‌రౌండ్ షో; విండీస్‌పై పాక్ గెలుపు

15 Jul, 2013 12:40 IST|Sakshi
షాహిద్ ఆఫ్రిది

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో సత్తా చాటి ఒంటిచేత్తో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఆఫ్రిది దెబ్బకు విండీస్ విలవిల్లాడింది.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసింది. ఆఫ్రిది 55 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మిస్బా అర్థసెంచరీ(52) సాధించాడు. మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు.

225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. ఆఫ్రిది స్పిన్ మాయాజాలానికి 98 పరుగులకే కుప్పకూలింది. 126 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలయింది. 25 పరుగులు చేసిన శామ్యూల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 9 ఓవర్లు వేసిన ఆఫ్రిది కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు నేలకూల్చాడు.

దీంతో పాకిస్థాన్ తరపున వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్ గా అతడు రికార్డు సాధించాడు. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్న ఆఫ్రిది 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో పాకిస్థాన్‌కు 1-0 ఆధిక్యం లభించింది.

మరిన్ని వార్తలు