షెహజాద్‌ను సస్పెండ్‌ చేశారు..!

11 Aug, 2019 13:43 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ షెహజాద్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) సస్పెండ్‌ చేసింది. షెహజాద్‌ పదే పదే బోర్డు నియమాలను ఉల్లఘిస్తున్నాడని అభియోగాలు మోపిన అఫ్గానిస్తాన్‌ బోర్డు.. నిరవధికంగా సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత షెహజాద్‌ ఫిట్‌గా లేడంటూ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాను ఫిట్‌గానే ఉన్నప్పటికీ బోర్డు కావాలనే తనపై వేటు వేసిందని షెహజాద్‌ పేర్కొన్నాడు. తన క్రికెట్‌ కెరీర్‌ను నాశనం చేసేందుకు తమ క్రికెట్‌ బోర్డులోని కొందరు పెద్దలు కుట్ర పన్నారని విమర్శించాడు.

తాజాగా షెహజాద్‌ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బోర్డు క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించిన కారణంగానే అతనిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఏసీబీ తెలిపింది. గత నెలలో క్రమశిక్షణా నియమావళి సమావేశాలు జరగ్గా అందుకు షెహజాద్‌ గైర్హాజరీ అయ్యాడని బోర్డు పేర్కొంది. మరొకవైపు బోర్డు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలా పదే పదే బోర్డు నియమాలను పెడ చెవిన పెడుతున్న షెహజాద్‌పై సస్పెన్షనే సరైనదని భావించి ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఏసీబీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ఆ సమస్య నాకు లేదు: శ్రేయస్‌ అయ్యర్‌

పృథ్వీ షా డోప్‌ టెస్ట్‌లో కొత్త కోణం

విరాట్‌ కోహ్లి వినూత్నంగా..

రెండుసార్లు మోకాలి సర్జరీ చాలా కష్టం: రైనా

26 ఏళ్ల రికార్డుకు చేరువలో కోహ్లి

హోమాన్షిక రెడ్డికి మూడు స్వర్ణాలు

క్వార్టర్స్‌లో స్నేహిత్, మొహమ్మద్‌ అలీ

మళ్లీ నంబర్‌వన్‌గా ఒసాకా

నాలుగో స్వర్ణంపై రెజ్లర్‌ వినేశ్‌ గురి

భారత్‌ ‘ఎ’కు చేజారిన విజయం

ఇది సానుకూల మలుపు

టైటిల్‌ పోరులో సిక్కి–అశ్విని జంట

గేల్‌కు వీడ్కోలు టెస్టు లేదు

ఆడొచ్చు...అవాంతరం లేకుండా!

ధోనికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

స్మిత్‌కు అతనే సరైనోడు: వార్న్‌

ఎంసీసీ మీటింగ్‌కు గంగూలీ దూరం

అయ్యో గేల్‌.. ఇలా అయ్యిందేమిటి?

మళ్లీ చెలరేగిన నదీమ్‌

రైనా.. నువ్వు త్వరగా కోలుకోవాలి

మెకల్లమ్‌ కొత్త ఇన్నింగ్స్‌!

రోహిత్‌, జడేజా మీరు ఏం చేస్తున్నారు?: కోహ్లి

ప్రపంచ పోలీసు క్రీడల్లో తులసీ చైతన్యకు రజతం

ఇది క్రికెట్‌లో అధ్వానం: కోహ్లి

క్వార్టర్స్‌లో రాగ నివేదిత, ప్రణీత

శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ 

బజరంగ్‌ పసిడి పట్టు 

సెమీస్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ 

వారెవ్వా వారియర్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌