మనోడికి ఏ బంతైనా ఒక్కటే: సాహా

21 Nov, 2019 12:35 IST|Sakshi

కోల్‌కతా:  భారత క్రికెట్‌ జట్టు తొలిసారి పింక్‌ బాల్‌ టెస్టుకు సిద్ధమైంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో ఈడెన్‌ గార్డెన్‌లో ఆరంభం కానున్న డే అండ్‌ నైట్‌ టెస్టులో టీమిండియా తలపడనుంది. అయితే పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌ టెస్టుల అనుభవం లేని భారత జట్టు ఎంతవరకూ ఆకట్టుకుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంంగా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టును ఇన్నింగ్స్‌ 130 తేడాతో గెలిచిన టీమిండియా.. పింక్‌ బాల్‌ టెస్టు ఎంత వరకూ రాణిస్తుందో అనే దానిపై ఫ్యాన్స్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్ర బాల్‌తో మెరిసిన భారత బౌలర్లు.. పింక్‌ బాల్‌పై పట్టు ఎంతవరకూ సాధిస్తారో అనేది చూడాలి.(ఇక్కడ చదవండి: రెడ్‌–పింక్‌ క్రికెట్‌ బాల్స్‌ మధ్య తేడా ఏమిటి!?)

అయితే తన బౌలింగ్‌తో ప్రత్యేక ముద్ర వేసి భారత జట్టులో కీలక పేస్‌ బౌలర్‌గా మారిపోయిన మహ్మద్‌ షమీకి ఏ బంతైనా ఒక్కటే అంటున్నాడు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా. ‘ షమీకి అది రెడ్‌ బంతా.. పింక్‌  బంతా అనేది ముఖ్యం కాదు. ఏ బంతితోనైనా చెలరేగిపోతాడు. మనోడికి పింక్‌ బాల్‌ అనేది సమస్య కాదు. ఎక్స్‌ట్రా రివర్స్‌ స్వింగ్‌తో ఫలితాన్ని రాబట్టడంలో షమీ దిట్ట. ఏ బంతితోనైనా షమీ దడపుట్టిస్తాడు. అలానే ఇషాంత్‌, ఉమేశ్‌లు కూడా పింక్‌ బంతితో రాణించడం ఖాయం. ఓవరాల్‌గా చూస్తే టీమిండియా పేసర్లకు బంతి కలర్‌ అనేది ప్రాబ్లమే కాదు. ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే భారత పేసర్లను నిలువరించడం బంగ్లాదేశ్‌కు కష్టం’ అని సాహా పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు