షమీ విజృంభణ

21 Oct, 2019 14:52 IST|Sakshi

రాంచీ: టీమిండియాతో మూడో టెస్టులో ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. తొలి ఇన‍్నింగ్స్‌లో 162 పరుగులకే చాపచుట్టేసిన సఫారీలు.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయారు. భారత పేస్‌ బౌలింగ్‌కు వణికిపోతున్న దక్షిణాఫ్రికా డీకాక్‌(5), హమ్జా(0), డుప్లెసిస్‌(4), బావుమా(0)ల వికెట్లను కోల్పోయింది. ఈ నాలుగు వికెట్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌ వికెట్‌ తీశాడు. షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి సఫారీలు ఆపసోపాలు పడుతున్నారు. షమీ విజృంభణతో సఫారీల బ్యాటింగ్‌ ఆర్డర్‌ కకావికలమైంది.

 హమ్జా బౌల్డ్‌ చేసిన షమీ.. డుప్లెసిస్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపించాడు. ఆపై  బావుమాకు షమీ అద్భుతమైన బంతిని సంధించడంతో సాహాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు తొలి వికెట్‌గా డీకాక్‌ను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. మూడో రోజు టీ విరామానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.  టీ బ్రేక్‌కు ముందు ఉమేశ్‌ యాదవ్‌ నుంచి దూసుకొచ్చిన బంతి ఎల్గర్‌కు బలంగా తాకింది. దాంతో జట్టు ఫిజియోథెరఫీ హుటాహుటీనా మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు. ఈ తరుణంలోనే టీ బ్రేక్‌ ఇచ్చారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 497/9 వద్ద డిక్లేర్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరల్డ్‌కప్‌కు ఇంకా సమయం ఉంది: రోహిత్‌

ఎఫ్‌–1 సీజన్‌ రద్దు చేయాలి

విరామం మంచిదేనా!

ఎంతో మందిని చూశా.. కానీ ధోని అలా కాదు

నీకు ఆవేశం ఎక్కువ.. సెట్‌ కావు..!

సినిమా

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ