21 Apr, 2018 11:10 IST|Sakshi

పుణే : ఈ దఫా ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు.. అభిమానుల అంచనాల మేరకు రాణించలేకపోతోంది. ఈ నేపథ్యంలో స్పిన్‌ దిగ్గజం టీమ్‌ మెంటర్‌ షేన్‌ వార్న్‌ క్షమాపణలు తెలియజేశారు. ‘గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మూడు విభాగాల్లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఘోరంగా విఫలం అయ్యింది. అందుకు అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. జట్టు సభ్యులు తమ శక్తిమేర ఆడటానికి యత్నిస్తున్నారు. కాస్త ఓపిక పట్టండి. వచ్చే మ్యాచ్‌ల్లో గెలుపు సాధించి తీరతాం’ అంటూ వార్న్‌ ఓ ట్వీట్‌ చేశారు. 

కాగా, ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ 4 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గత రాత్రి పుణే వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో రాజస్థాన్‌ ఓడిన విషయం తెలిసిందే. 204 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ 140 పరుగులకే అలౌట్‌ అయ్యి ఘోర పరాజయం చవిచూసింది.

మరిన్ని వార్తలు