తన ఫాలోవర్స్‌కు క్షమాపణ చెప్పిన వాట్సన్‌

16 Oct, 2019 14:44 IST|Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. తనకు తెలియకుండానే తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు షేర్‌ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ అయిన లోదుస్తులు ధరించిన మహిళకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను బ్రిటీష్‌ టాబ్లాయిడ్‌ 'ది సన్‌' ప్రచురించడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నాడు. దీనిపై వాట్సన్‌ స్పందిస్తూ.. 'నా అకౌంట్‌ తనకు తెలియకుండానే ఎవరో హ్యాక్‌ చేశారు. గత శుక్రవారం ఇదే విధంగా ట్విటర్‌ అకౌంట్‌ను కూడా హ్యాక్‌ చేశారు. ఈ సందర్భంగా మీఅందరితో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. ఈ ఫోటోలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. సోషల్‌ మీడియాలో తనను ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరిని క్షమాపణ కోరుతున్నట్లు' ట్వీట్‌ చేశాడు. షేన్‌ వాట్సన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర అకౌంట్లతో కలిపి దాదాపు 2 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఆస్ట్రేలియా తరపున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించిన వాట్సన్‌ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఆస్ట్రేలియా 2007, 2015 ప్రపంచకప్‌లు గెలవడంలో వాట్సన్‌ పాత్ర మరువలేనిది. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

మరిన్ని వార్తలు