షరపోవా జోరు

2 Sep, 2017 15:07 IST|Sakshi
షరపోవా జోరు

న్యూయార్క్:యూఎస్ గ్రాండ్ స్లామ్లో రష్యా భామ మారియా షరపోవా తన జోరును కొనసాగిస్తున్నారు. డోపింగ్ కారణంగా దాదాపు 15 నెలలు పాటు ఆటకు దూరమైనా తన ఆటలో ఏ మాత్రం వన్నె తగ్గలేదని షరపోవా మరోసారి నిరూపించుకున్నారు. మహిళల సింగిల్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన పోరులో షరపోవా 7-5, 6-2 తేడాతో యూఎస్ టీనేజర్ సోఫియా కెనిన్ పై అలవోక విజయాన్ని సాధించారు. తద్వారా ప్రిక్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు.

 

తొలి సెట్ లో అనేక విన్నర్స్ ను సాధించిన షరపోవా అదే క్రమంలో అనవసర తప్పిదాలను కూడా చేశారు. దాంతో 7-5 తేడాతో మాత్రమే తొలి సెట్ ను కైవసం చేసుకున్నారు. అయితే రెండో సెట్ లో సోఫియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించారు. రెండో సెట్ లో 3-0 ఆధిక్యంతో దూసుకుపోయిన షరపోవా..ఆపై వెనుదిరిగి చూసుకోలేదు. షరపోవా తన తదుపరి రౌండ్ లో అన‌స్తిజా సెల‌వ‌టోవాతో తలపడనున్నారు.

మరిన్ని వార్తలు