లక్ష్యం... టాప్‌ 20: శరత్‌

15 Feb, 2019 08:48 IST|Sakshi

ముంబై: ఈ ఏడాది టాప్‌–20లోకి చేరడమే తన లక్ష్యమని భారత స్టార్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు శరత్‌ కమల్‌ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకుల్లో 33వ స్థానంలో ఉన్నాడు.  ఈ ఏడాదిలో తన లక్ష్యాన్ని నెరవేర్చు కోవడంతోపాటు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌ తప్పకం పతకం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.  గతేడాది ఆసియా క్రీడల టీటీలో సాధించిన రెండు కాంస్య పతకాలు తనలో ఆత్మవిశ్వాసం పెంపొందిం చాయని పేర్కొన్న కమల్‌... ఆ స్ఫూర్తితో ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు ప్రయత్నిస్తు న్నట్లు వివరించాడు.

ఆసియా క్రీడల్లో తీవ్ర పోటీ ఉంటుందని, అలాంటి చోటే రెండు పతకాలు నెగ్గగలిగామంటే ఇక ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు పతకాలు దక్కే రోజు దగ్గరలోనే ఉందని అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రీడల్లో శరత్‌ కమల్‌ నేతృత్వంలోని భారత జట్టు కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి 60 ఏళ్ల తర్వాత తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శరత్‌తోపాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మనికా బాత్ర సైతం కాంస్యం నెగ్గి భారత్‌కు ఈ విభాగంలో ఒలింపిక్‌ పతకాలపై ఆశలు రేకెత్తించారు.  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాఫర్‌

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ

చాంపియన్‌ కార్తీక్‌ సాయి

సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

బౌండరీలు కూడా సమానమైతే?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

ఆ విషయంలో ఇండియాదే పైచేయి.. కానీ!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హిమాన్షు, నమితలకు టైటిల్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’