రవిశాస్త్రి సానుకూల స్వభావి..

19 Jul, 2017 13:27 IST|Sakshi
రవిశాస్త్రి సానుకూల స్వభావి..
కొలంబో: భారత్‌ నూతన కోచ్‌ రవిశాస్త్రి సానుకూల ధృక్పథం కలిగిన వ్యక్తి అని టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు మన బలమే మనకు రక్షా అని ఎల్లప్పుడు చెప్పేవాడని సాహా గుర్తు చేసుకున్నాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా జట్టుతో చేరిన సాహా కోచ్‌ మార్పుపై మాట్లాడుతూ.. కుంబ్లే, శాస్త్రీ ఇద్దరు జట్టుకు సేవలందించిన వారని తెలిపాడు. రవిశాస్త్రి డైరెక్టర్‌గా భారత్‌ 2015 వరల్డ్‌ కప్‌లో సెమీ ఫైనల్‌ చేరిందని, శ్రీలంక టెస్టు సిరీస్‌ గెలిచామని సాహా గుర్తు చేశాడు. కుంబ్లే సారథ్యంలో నమోదు చేసిన విజయాలు తెలిసిందేనని పేర్కొన్నాడు. 
 
సూచనలు ఇవ్వడంలో కోచ్‌గా ఎవరి ప్రత్యేకత వారిదేనన్న సాహా.. మైదానంలో రాణించడం ప్లేయర్‌గా మా బాధ్యత అని చెప్పుకొచ్చాడు. కోచ్‌లు మారినంత మాత్రానా ఆటలో పెద్ద తేడా ఏమి ఉండదని సాహా అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్‌ అనంతరం చాల రోజుల తర్వతా శ్రీలంక టూర్‌కు ఎంపికైన సాహా.. లోకల్‌ లీగ్‌లు ఆడానని, అవి నాకు చాల ఉపయోగపడ్డాయని తెలిపాడు. శ్రీలంకలో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌ విజయాలనే పునరావృతం చేస్తామని సాహా ధీమా వ్యక్తం చేశాడు. ఈ లాంగ్ గ్యాప్‌ మాపై ప్రభావం చూపదని పేర్కొన్నాడు. తొలిటెస్టుకు ముందు జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కీలకమని సాహా పేర్కొన్నాడు. భారత్‌ శ్రీలంకతో 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. తొలి టెస్టు జులై 26 నుంచి మొదలుకానుంది.
మరిన్ని వార్తలు