కాట్రెల్‌కు కింగ్స్‌ ‘భారీ’ సెల్యూట్‌

19 Dec, 2019 17:20 IST|Sakshi

కోల్‌కతా: వెస్టిండీస్‌ పేసర్‌ షెల్డాన్‌ కాట్రెల్‌ గురించి ముందుగా చెప్పాలంటే అతని చేసే సెల్యూటే గుర్తుకు వస్తూ ఉంటుంది. వికెట్‌ తీసిన ఎక్కువ సందర్భాల్లో కాట్రెల్‌ సెల్యూట్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఐపీఎల్‌ వేలంలో కాట్రెల్‌కు కింగ్స్‌ పంజాబ్‌ పెద్ద సెల్యూటే చేసింది. అతన్ని రూ. 8.50 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 50  లక్షలు ఉండగా, భారీ మొత్తం వెచ్చించి కింగ్స్‌ పంజాబ్‌ దక్కించుకుంది. భారత్‌తో విశాఖలో జరిగిన రెండో  వన్డేలో కాట్రెల్‌ భారీగా పరుగులు  ఇచ్చినప్పటికీ ఇలా అత్యధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. పలు ఫ్రాంఛైజీలు కాట్రెల్‌కు కోసం పోటీ పడగా కింగ్స్‌ పంజాబ్‌ అతన్ని కొనుగోలు చేయడం విశేషం.

వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌ను ఐపీఎల్‌ వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. హోప్‌ కనీస ధర రూ. 50 లక్షలు  ఉండగా అతనిపై బిడ్‌ వేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న హోప్‌ విశేషంగా రాణిస్తున్నాడు. దాంతో ఐపీఎల్‌ వేలంలో తాను భారీ ధర పలుకుతాననే నమ్మకంతో హోప్‌ ఉన్నాడు. కానీ అతనికి తొలి రౌండ్‌ వేలంలో అమ్ముడుపోలేదు.  మరి చివర్లో హోప్‌పై ఏ ఫ్రాంఛైజీ అయినా దృష్టి పెడుతుందుమో చూడాలి.

>
మరిన్ని వార్తలు