శిఖర్‌ధావన్‌ మరో అరుదైన రికార్డు

27 Jul, 2017 17:10 IST|Sakshi
శిఖర్‌ధావన్‌ మరో అరుదైన రికార్డు

సాక్షి, స్పోర్ట్స్‌: భారత డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. భారత్‌- శ్రీలంకల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 168 బంతుల్లో 190 పరుగులు చేసి స్కోర్‌బోర్డును పరుగులెత్తించాడు. సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. బ్రాడ్‌మన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ సరసన చేరాడు.

లంచ్‌ బ్రేక్‌ నుంచి టీ బ్రేక్‌ మధ్య రెండు సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఈ జాబితాలో మొదట సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ లు లంచ్‌ బ్రేక్‌, టీబ్రేక్‌ మధ్య రెండు సెంచరీలు చేశారు. 2012-13లో ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగన టెస్టు మ్యాచ్‌లో ధావన్‌ తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో లంచ్‌, టీ బ్రేక్‌ల మధ్య 106 పరుగులు చేశాడు. అనంతరం బుధవారం శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.

క్రికెట్‌ దిగ్గజం బ్రాడ్‌మన్‌ 1930,1934లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీలు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2005-06లో పాకిస్తాన్‌ మీద 109 పరుగులు చేయగా, 2007-08లో దక్షిణాఫ్రికాతో చెన్నైలో జరిగిన టెస్టుమ్యాచ్‌లో 108 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు