శివ థాపాకు రజతం

2 Apr, 2016 00:05 IST|Sakshi
శివ థాపాకు రజతం

 కియానన్ (చైనా): రియో ఒలింపిక్స్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత యువ బాక్సర్ శివ థాపా ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ను రజతంతో ముగించాడు. శుక్రవారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం ఫైనల్లో శివ థాపా 0-3తో (27-30, 27-30, 27-30) చాట్‌చాయ్ బుట్‌డీ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు పురుషుల 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ ‘బాక్స్ ఆఫ్’ బౌట్‌లో ఓటమి చవిచూశాడు.

దేవేంద్రో 0-3తో (28-29, 27-30, 27-30) గాన్ ఎర్డెన్ గాన్‌ఖుయాగ్ (మంగోలియా) చేతిలో పరాజయం పాల య్యాడు. దాంతో ఈ టోర్నీ ద్వారా దేవేంద్రో రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయాడు. ఇప్పటివరకు భారత్ నుంచి శివ థాపా ఒక్కడే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు భారత పురుషుల బాక్సర్లకు మరో రెండు అవకాశాలు ఉన్నాయి. మహిళా బాక్సర్లకు మాత్రం ఏకైక అవకాశం ఉంది. మే 19 నుంచి 27 వరకు కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు కేటగిరిల్లో సెమీఫైనల్‌కు చేరిన నలుగురు బాక్సర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

మరిన్ని వార్తలు