నేటి మ్యాచ్‌లో భారతే ఫేవరెట్ ‌: అక్తర్‌

9 Jun, 2019 13:35 IST|Sakshi
షోయబ్‌ అక్తర్‌

ఇస్లామాబాద్‌ : మరికొద్దిసేపట్లో భారత్‌Vs ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కోహ్లిసేననే హాట్‌ ఫేవరెట్‌ అని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఏ లెక్క చూసినా భారత్‌కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని తెలిపాడు. తన సొంత యూట్యూబ్‌ చానెల్‌లో ఈ మ్యాచ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

‘ఆస్ట్రేలియా కన్నా భారత్‌కే అవకాశాలున్నాయి. భారత్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌తో సమన్వయంగా ఉంది. మంచి స్పిన్నర్లు, పేసర్లున్నారు. అయితే జట్టులోకి మహ్మద్‌ షమీని తీసుకోవాలి. అప్పుడే పేస్‌ విభాగం మరింత బలంగా తయారవుతుంది. భారత్‌ టాపర్డర్‌ రాణిస్తే తిరుగులేదని చరిత్ర చెబుతోంది. ఓపెనర్‌గా రోహిత్‌ చెలరేగితే భారత్‌కు వచ్చే ఇబ్బందేలేదు. అలాగే కోహ్లి కూడా తనదైన శైలిలో రాణిస్తే భారత విజయం ఖాయం. ఇక భారత్‌కు ఒత్తిడి ఎలా అధిగమించాలి. ఎప్పుడు ఎవరిని బౌలింగ్‌ చేయించాలి, స్వింగ్‌, స్పిన్‌ను ఏ పరిస్థితుల్లో వాడుకోవాలో అనేదానిపై మంచి పట్టు ఉంది. కాబట్టి భారత్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని నేను భావిస్తున్నాను. ఆస్ట్రేలియాపై ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారతే ఫెవరెట్‌. ఎందుకుంటే ఆసీస్‌ కన్నా మెరుగైన స్పిన్నర్లు భారత్‌కు ఉన్నారు. వారి ఎదుర్కోవడం చాలా కష్టం’ అని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ టోర్నీ నేపథ్యంలో అక్తర్‌ ఆయా మ్యాచ్‌లపై తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా విశ్లేషణలు చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే.
చదవండి: ‘డివిలియర్స్‌కు దేశం కన్నా డబ్బులే ముఖ్యం’

 

మరిన్ని వార్తలు