భారత్‌-పాక్‌ సంబంధాల కోసం యువత కృషి చేయాలి

7 Apr, 2018 18:10 IST|Sakshi
షోయబ్‌ అక్తర్‌ (ఫైల్‌ ఫొటో)

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌

ఇస్లామాబాద్‌ : భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు.  ఇప్పుడు ఆ దేశానికే చెందిన మరో మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ మాత్రం ఇరు దేశాల సత్సంబంధాల కోసం యువత కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇప్పటికే ద్వేషంతో ఇరు దేశ ప్రజలు 70 ఏళ్లు జీవించారని, ఇలా మరో 70 ఏళ్లు నివసించడానికి సిద్దంగా ఉన్నారా అని ట్విటర్‌ వేదికగా యువతను ప్రశ్నించాడు. 

‘భారత్‌-పాక్‌ సంబంధాల కోసం ఇరు దేశాల యువత కృషి చేయాలి. గత డెబ్బై ఏళ్లుగా మన హక్కులను, పెండింగ్‌లో ఉన్న హామీలను ఎందుకు పరిష్కరించలేకపోయారనే కఠినమైన ప్రశ్నలతో అధికారులను నిలదీయండి. ఇరు దేశాల మధ్య ద్వేషంతో మరో 70 ఏళ్లు బతకడానికి సిద్దంగా ఉన్నారా’ అని ట్వీట్‌ చేశాడు. శుక్రవారం బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌పై విధించిన శిక్షపై విచారం వ్యక్తం చేసిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌.. శనివారం బెయిల్‌ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు