సానియాతో పెళ్లి.. మాలిక్‌ ఏమన్నాడంటే

21 Jun, 2020 14:47 IST|Sakshi

హైదరాబాద్‌:  అభిమానుల నుంచి ఎంతో వ్యతిరేకత, ఎన్నో వివాదాల సమక్ష్యంలోనే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఏప్రిల్‌ 12, 2008న వివాహం చేసుకున్నాడు. వీరికి 2018లో ఇజ్జాన్ జన్మించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య ఎలాంటి గొడవలు జరిగినా, క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినా ఈ జంటను టార్గెట్‌ చేయడం కొంతమంది నెటిజన్లకు సాధారణంగా మారింది. అయితే తమ పెళ్లై ఏళ్లు గడుస్తున్నప్పటికీ సానియాను తాను పెళ్లి చేసుకోవడంపై వస్తున్న అనేక వార్తలపై మాలిక్‌ తాజాగా స్పందిస్తూ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (పీసీబీ పర్మిషన్..‌ భారత్‌కు షోయబ్‌!)

‘మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు.. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశం, రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను పట్టించుకోకూడదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకరికొకరు నచ్చామా? అర్థం చేసుకున్నామా? ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయా? అనే విషయాల గురించి ఆలోచించాలి. భారత్‌లో నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల గురించి ఆందోళన గాని బాధ గాని పడటం లేదు. ఎందుకుంటే నేను క్రికెటర్‌ను రాజకీయ నాయకుడిని కాదు’ అంటూ మాలిక్‌ పేర్కొన్నాడు. (మొర్తజాకు కరోనా‌ పాజిటివ్‌)

దాదాపు ఐదు నెలల తర్వాత భార్యాబిడ్డ దగ్గరికి
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మాలిక్‌ పాకిస్తాన్‌లో ఉండిపోగా సానియా, ఇజ్జాన్‌లు హైదరాబాద్‌లో ఉన్నారు. దీంతో గత ఐదు నెలలుగా భార్య, బిడ్డలకు మాలిక్‌ దూరమయ్యాడు. ఈనేపథ్యంలో రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌‌కు షోయబ్‌ను పాకిస్తాన్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. దీంతో మళ్లీ కుటుంబాన్ని కలుసుకోలేనేమోనని బాధపడిన షోయబ్ పీసీబీకి ఓ విజ్ఞప్తి చేశాడు. జట్టుతో ఆలస్యంగా చేరతానని, కొన్ని రోజులు కుటుంబంతో గడిపి వవస్తానని బోర్డును కోరాడు. దీనికి పీసీబీ కూడా అంగీకరించింది. దీంతో ఎట్టకేలకు షోయబ్ తన భార్య, బిడ్డను కలుసుకోనున్నాడు. (‘ఆ విషయంలో జడేజాను మించినోడు లేడు’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా