'రసెల్‌తో ఆడితే అదే ఫీలింగ్‌ కలుగుతుంది'

29 Apr, 2020 08:30 IST|Sakshi

కోల్‌కతా : కరోనా నేపథ్యంలో క్రీడలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌తో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాడు శుభమన్‌ గిల్‌ ట్విటర్‌ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలతో ఆకట్టుకున్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరపున విండీస్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ తో బ్యాటింగ్‌ చేసేటప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుందని ఒక అభిమాని అడిగాడు. దానికి శుభమన్‌ స్పందిస్తూ..'రసెల్‌తో ఆడినప్పుడు మ్యాచ్‌ హైలెట్స్‌ చూస్తున్నామా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఎందుకంటే అతను ఆడితే నేను నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌కు పరిమితమవ్వాల్సి వస్తుందంటూ' నవ్వుతూ పేర్కొన్నాడు. (శర్వాణ్‌... నీవు కరోనా వైరస్‌ కంటే డేంజర్‌: గేల్‌)

ఇక క్రికెట్‌ నుంచి రిటైరైన ఆటగాళ్లలో నువ్వు ఎవరితో ఆడడానికి ఇష్టపడతావు మరో అభిమాని ప్రశ్నించగానే.. శుభమన్‌ ఒక్క సెకన్‌ కూడా ఆలోచించకుండా లెజెండరీ సచిన్‌ టెండూల్కర్‌ పేరు చెప్పేశాడు. ' సచిన్‌ గొప్ప ఆటగాడు.. అతని ఆటను చూస్తూ పెరిగా.. ఇప్పటికీ అవకాశమొస్తే సచిన్‌తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా' అని పేర్కొన్నాడు. ఇక విదేశీ ఆటగాళ్లలో తనకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించాడు.కోల్​కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ దినేశ్ కార్తీక్ గొప్ప నాయకుడంటూ పొగిడాడు. ఫ్రాంచైజీ యజమాని షారూక్​ ఖాన్ ​తాము ఓడినా.. గెలిచినా ఎప్పుడూ ఎంతో మద్దతుగా నిలుస్తాడని గిల్ చెప్పుకొచ్చాడు. అలాగే ఫుట్​బాల్​లో తనకు క్రిస్టియానో రొనాల్డో కంటే లియోనెల్ మెస్సీ అంటేనే ఇష్టమని శు​భ్​మన్​గిల్ తెలిపాడు. 2018 నుంచి కేకేఆర్‌ తరపున ఆడుతున్న శుభమన్‌ గిల్‌  132 స్ట్రైక్‌రేట్‌తో  499 పరుగులు సాధించాడు.(మిస్టరీ : అసలు ఆరోజు ఏం జరిగింది?)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా