క్రికెట్‌కు సిడెల్‌ గుడ్‌ బై

29 Dec, 2019 11:24 IST|Sakshi

మెల్‌బోర్న్‌:  ఆసీస్‌ వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పీటర్‌ సిడెల్‌ తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. ఆసీస్‌ తరఫున 11 ఏళ్లు క్రికెట్‌ ఆడిన 35 ఏళ్ల సిడెల్‌ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. తాను రిటైర్మెంట్‌ తీసుకోవడానికి ఇదే తగిన సమయమని భావించి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు వెల్లడించాడు. ఆసీస్‌ జట్టుకు ఆడటాన్ని గొప్పగా భావించానని చెప్పుకొచ్చిన సిడెల్‌.. కాస్త బాధతోనే క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నానని అన్నాడు. ‘ నా చిన్నతనంలో నాలో క్రికెట్‌ పరంగా సూపర్‌ టాలెంట​ ఏమీ లేదు. ఆసీస్‌కు ఆడాలనే ప్రయత్నంలో ఎక్కువగా శ‍్రమించే లక్ష్యాన్ని చేరుకున్నా. బ్యాగీ గ్రీన్‌ను ధరించడం గొప్పగా భావించా. ఒక్కసారి ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహిస్తే సరిపోతుందని అనుకున్నా. యాషెస్‌ సిరీస్‌ వంటి ప్రతిష్టాత్మక సిరీస్‌ కూడా ఆడా.

నేను ఆడుతున్న సమయంలో ముగ్గురు ఫాస్ట్‌  బౌలర్లు అరంగేట్రం చేశారు. ఆపై వారు క్రికెట్‌ నుంచి వీడ్కోలు కూడా తీసుకున్నారు. వారు నా కంటే చాలా వయసులో ఉన్నారు. వారి వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పారు. నేను జట్టు నుంచి ఉద్వాసన గురైన ప్రతీసారి నాలో సత్తాను నిరూపించుకుని మళ్లీ జట్టులోకి వచ్చా’ అని సిడెల్‌ తెలిపాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 67 టెస్టులు ఆడిన సిడెల్‌.. 221 వికెట్లు సాధించాగు. అందులో ఐదు వికెట్ల మార్కును ఎనిమిదిసార్లు చేరాడు. ఆసీస్‌ తరఫున 13వ అత్యధిక వికెట్‌ టేకర్‌గా సిడెల్‌ ఉన్నాడు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అది కూడా సిడెల్‌ 26వ బర్త్‌ డే రోజున హ్యాట్రిక్‌ సాధించాడు.  ఇక 20 వన్డేలు, రెండు టీ20లు సిడెల్‌ ఆడాడు. ఆసీస్‌ తరఫున చివరగా యాషెస్‌ సిరీస్‌లో సిడెల్‌ పాల్గొన్నాడు.

మరిన్ని వార్తలు