జికా భయం... రియోకు రాలేం

17 Jul, 2016 10:32 IST|Sakshi
జికా భయం... రియోకు రాలేం

ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న రానిచ్, హాలెప్
పారిస్: జికా వైరస్ కారణంగా రియో నుంచి అథ్లెట్లు తప్పుకోవడం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా వింబుల్డన్ రన్నరప్ రానిచ్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హాలెప్... ఇద్దరూ రియో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జికా వైరస్ కారణంగానే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇరువురూ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా కూడా పలువురు ఆటగాళ్లు రియోకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో రియోలో భద్రతను రెట్టింపు చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. క్రీడా గ్రామంలో 85వేల మంది పోలీసులతోపాటు కట్టుదిట్టమైన ట్రాఫిక్ నిబంధనలు, అదనంగా చెక్‌పాయింట్స్, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రెజిల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు