భారత యువ అథ్లెట్స్‌కు ఆరు పతకాలు

16 Mar, 2019 00:13 IST|Sakshi

హాంకాంగ్‌: ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. రెండు స్వర్ణాలు, మూడు కాంస్యాలు, ఒక రజతంతో కలిపి మొత్తం ఆరు పతకాలు సాధించారు. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో థబిత ఫిలిప్‌ మహేశ్వర  13.86 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

బాలుర హ్యామర్‌త్రోలో విపి¯Œ  కుమార్‌ (69.63 మీటర్లు) పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. బాలికల హ్యామర్‌ త్రోలో హర్షిత షెరావత్‌ రజతం (61.93 మీటర్లు) దక్కించుకుంది. బాలుర పోల్‌వాల్ట్‌లో దీపక్‌ (4.70 మీటర్లు)... బాలుర ట్రిపుల్‌ జంప్‌లో విశాల్‌ మోర్‌ (15.09 మీటర్లు)... బాలుర 1500 మీటర్ల రేసులో అజయ్‌ (3ని:57.25 సెకన్లు) కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు