ఓవర్లో ఆరు సిక్సర్లు

1 Dec, 2016 23:46 IST|Sakshi
ఓవర్లో ఆరు సిక్సర్లు

ముంబై: తొమ్మిదేళ్ల క్రితం టి20 ప్రపంచకప్‌లో డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అబ్బురపరిచిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు స్థానికంగా జరిగిన టైమ్స్ షీల్డ్ ‘బి’ డివిజన్ మ్యాచ్‌లోనూ ఈ ఫీట్ పునరావృతమైంది.

ఆర్‌సీఎఫ్‌తో జరిగిన ఈ మ్యాచ్ రెండో రోజున వెస్ట్రన్ రైల్వే ఆటగాడు సాగర్ మిశ్రా..  ఆఫ్ స్పిన్నర్ తుషార్ కుమార్ వేసిన ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి టోర్నమెంట్ రికార్డును సృష్టించాడు. గతేడాదే రైల్వేస్ తరఫున తను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

మరిన్ని వార్తలు