‘వింటర్‌’లో టాపర్‌గా...

22 Feb, 2018 01:34 IST|Sakshi

జోర్జెన్‌ ఖాతాలో 14వ పతకం 

ప్యాంగ్‌చాంగ్‌: వింటర్‌ ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధికంగా 14 పతకాలు గెలిచిన ప్లేయర్‌గా నార్వేకు చెందిన మారిట్‌ జోర్జెన్‌ చరిత్ర సృష్టించింది. తాజా ఒలింపిక్స్‌లో ఆమె ఖాతాలో నాలుగో పతకం చేరింది. స్కీయింగ్‌లో మెరిక అయిన జోర్జెన్‌ క్రాస్‌ కంట్రీ టీమ్‌ స్ప్రింట్‌ ఫ్రీ ఈవెంట్‌లో మైకెన్‌ కాస్పెర్సన్‌ ఫల్లాతో కలిసి కాంస్య పతకం  గెలుచుకుంది. దాంతో 13 పతకాలతో నార్వే క్రీడాకారుడు ఒలె ఇనార్‌ జోర్న్‌డాలెన్‌ (నార్వే) పేరిట ఉన్న రికార్డును ఆమె తెరమరుగు చేసింది.

ఏ ఒలింపిక్స్‌ (వింటర్, సమ్మర్‌)లోనైనా అత్యధిక పతకాలు గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా 37 ఏళ్ల జోర్జెన్‌ ఘనత వహించింది. అలనాటి సోవియెట్‌ (ఇప్పటి ఉక్రెయిన్‌) జిమ్నాస్ట్‌ దిగ్గజం లారిసా లాతినినా సమ్మర్‌ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 18 పతకాలు సాధించింది. 

>
మరిన్ని వార్తలు