'కోహ్లి కన్నా అతనే గ్రేట్‌'

22 Dec, 2017 19:22 IST|Sakshi

సిడ్నీ:ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కంటే తమ దేశ కెప్టెన్‌ స్టీవ్‌ స‍్మిత్‌ అత్యంత విలువైన టెస్టు ఆటగాడని ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడు తనను తాను నిరూపించుకోవాలంటే విభిన్న పిచ్‌లు కలిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌, భారత్‌ దేశాలలో అద్బుత ఆటను కనబర్చిన వారిని అత్యుత్తమ అటగాళ్లుగా పరిగణిస్తారని  ఈ సందర్భంగా వార్న్‌పేర్కొన్నాడు. 2014 ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో కోహ్లీ ఘోరంగా విఫలమైన చోట స్మిత్‌ రాణించాడన్నాడు. ఈ మేరకు గతంలో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లిష్‌ పిచ్‌లపై స్మిత్‌ సాధించిన మూడు శతకాలను వార్న్‌ ఉదహరించాడు.

తన దృష్టిలో ఆ ఒక్క సిరీస్‌ కారణంగానే కోహ్లిని వెనక్కినెట్టి స్మిత్‌ ఆగ్రస్థానంలో కోనసాగుతున్నాడని పేర్కోన్నారు. దీనిలో భాగంగా 11 ఆటగాళ్లతో తన డ్రీమ్‌ టీమ్‌ను వార్న్‌ ప్రకటించాడు. ఇందులో వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాళ్లు రిచర్డ్స్‌, లారాలుండగా, భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, కోహ్లిలకు చోటు కల్పించాడు. ఇక స్వదేశం నుంచి  అలెన్‌ బోర్డర్‌,  గ్రెగ్‌ చాపెల్‌, రికీ పాంటింగ్‌, స్టివెన్‌ స్మిత్‌లకు తన కలల జట‍్టులో చోటివ్వగా, ఇంగ్లండ్‌ నుంచి ఆ జట్టు మాజీ కెప్టెన్‌ గ్రాహమ్‌ గూచ్‌, దక్షిణాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్‌, కల్లిస్‌లకు చోటు కల్పించాడు.

>
మరిన్ని వార్తలు