స్మిత్‌ అద్భుత బ్యాట్స్‌మన్‌ : గంగూలీ

7 Apr, 2017 19:02 IST|Sakshi
స్మిత్‌ అద్భుత బ్యాట్స్‌మన్‌ : గంగూలీ
కొల్‌కతా: రైజింగ్‌ పుణే సూపర్‌గెయింట్‌, ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తన జీవితాంతం ఫామ్‌ కలిగి ఉంటాడని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణే 7 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్మిత్‌ 84 (54 బంతులు)ను గంగూలీ పొగడ్తలతో ముంచెత్తాడు. స్మిత్‌ అధ్భుతంగా ఆడాడని, కెప్టెన్‌గా పుణేకు విజయం అందించాడని అభిప్రాయపడ్డాడు. స్మిత్‌ నాణ్యమైన ఆటగాడని, ప్రస్తుతం ప్రపంచంలోనే  అత్యంత అద్భుతమైన బ్యాట్స్‌మన్‌  అని గంగూలీ పేర్కొన్నాడు.  
 
27 ఏళ్ల స్మిత్‌ తన టెస్టు కెరీర్‌ను  లెగ్‌స్పిన్నర్‌గా ఆరంభించాడు. బ్యాటింగ్‌ ఎనిమిదో స్ధానంలో చేసేవాడు. బోర్డర్‌- గవాస్కర్‌ సిరీస్‌లో 3 సెంచరీలతో 499 పరుగుల చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు