‘జట్టుగా చేసిన పాపాన్ని స్మిత్‌ భరించాడు’

23 Apr, 2020 16:39 IST|Sakshi

జట్టు అంతా కలిసి చేసిన ట్యాంపరింగ్‌ అది

కానీ కెప్టెన్‌గా స్మిత్‌ తనపై వేసుకున్నాడు..

ట్యాంపరింగ్‌కు వార్నరే కారణం

లండన్‌: దాదాపు రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌ క్రాఫ్ట్‌లు బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నారు. ఈ వివాదంలో వార్నర్‌-స్మిత్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కోగా, బాన్‌ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం పడింది. అయితే ఆనాటి ట్యాంపరింగ్‌పై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తొలిసారి మాట్లాడాడు. అది కేవలం స్మిత్‌కు మాత్రమే తెలిసిన ట్యాంపరింగ్‌ కాదని, అప్పటి ఘటనలో ఆసీస్‌ మొత్తం జట్టు పాత్ర ఉన‍్నదని విషయం వాస్తవమన్నాడు. (భారత క్రికెటర్లు స్వార్థపరులు..వేస్ట్‌!)

‘ అది ఏమైనా చిన్న ఘటన కాదు కదా. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం. ఇందులో జట్టు సభ్యులు అందరి పాత్ర ఉంటుంది. కానీ స్మిత్‌ ఒక్కడే అవమానాన్ని భరించాడు. ఆ నెపాన్ని తనపై వేసుకున్నాడు. జట్టు అంతటిని బద్నాం చేయడం ఇష్టం లేక కెప్టెన్‌గా స్మిత్‌ తనపై వేసుకున్నాడు. దీనికి డేవిడ్‌ వార్నర్‌ ప్రధాన కారణం. ఇక్కడ జట్టులోని మిగతా సభ్యులు పాత్ర లేదంటే నేనైతే నమ్మను. ఒక బంతి ట్యాంపరింగ్‌ అయిన తర్వాత మరొక బౌలర్‌ అందుకుంటే అది కచ్చితంగా తెలిసిపోతుంది. నేనే బౌలర్‌ను అనుకోండి. వేరే వ్యక్తి బంతిని ట్యాంపర్‌ చేసి తర్వాత నాకిస్తే అది నాకు తెలియదా.. తెలుస్తుంది కదా.. ఆనాటి ట్యాంపరింగ్‌లో ఆసీస్‌ జట్టంతా ఉంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు’ అని ఫ్లింటాఫ్‌ అన్నాడు. ఏది ఏమైనా ఆ ట్యాంపరింగ్‌ ఘటన అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టును చిన్నబోయేలా చేసింది. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతాలు అనేవి క్రికెట్‌కు కొత్తేమీ కాదు. ఎప్పుట్నుంచూ అనాథిగా వస్తున్న ట్యాంపరింగ్‌కు క్రికెట్‌తో అవినావభావ సంబంధం ఉందంటే అతిశయోక్తి కాదేమో. (ఇంకా నాపై నిషేధం ఎందుకు?)

ఇక్కడ చదవండి:  ‘షీలా కి జవాని’కి వార్నర్‌ ఇరగదీశాడు..

>
మరిన్ని వార్తలు