-

కామెంటేటర్‌గా స్మృతి మంధాన!

24 Jul, 2018 11:36 IST|Sakshi
కామెంటరీ బాక్స్‌లో స్మృతి మంధాన

టాంటాన్‌ : భారత మహిళా క్రికెటర్‌ స్మృతీ మంధాన ప్రతిష్టాత్మక కియా సూపర్‌ టీ20 లీగ్‌లో ఆడతున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే మరీ కామెంటేటర్‌గా ఎందుకు మారింది అనుకుంటున్నారా? అవును నిజంగానే కామెంటేటర్‌గా మారింది. కియా సూపర్‌ లీగ్‌ అరంగేట్రపు మ్యాచ్‌లోనే ఈ భారత మహిళా క్రికెటర్‌ సత్తా చాటింది. 20 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 48 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయానంతరం ఆమె వ్యాఖ్యాత ఇషాగుహతో కలిసి కొద్దిసేపు సరదాగా కామెంటేటర్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యార్క్‌షైర్‌ డైమండ్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష‍్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్‌ స్ట్రోమ్‌ జట్టును మంధాన, కెప్టెన్‌ హీథర్‌ నైట్‌(96; 62 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు)లు దాటిగా ఆడి 15.3 ఓవర్లలోనే విజయాన్నందించారు. ఇక మంధాన ఇన్నింగ్స్‌పై భారత అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

చదవండి: తొలి భారత క్రికెటర్‌గా..

మరిన్ని వార్తలు