క్వార్టర్స్‌లో స్నేహిత్, మొహమ్మద్‌ అలీ

11 Aug, 2019 10:05 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ టీటీ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ (జీటీటీఏ), మొహమ్మద్‌ అలీ (ఎల్‌బీఎస్‌) పురుషుల సింగిల్స్‌ విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆనంద్‌ నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో స్నేహిత్‌ 4–1తో వరుణ్‌ శంకర్‌ (ఎంఎల్‌ఆర్‌)పై గెలుపొందగా... మొహమ్మద్‌ అలీ 4–3తో చంద్రచూడ్‌ను ఓడించి ముందంజ వేశారు. మహిళల విభాగంలో ఎం. మోనిక (జీఎస్‌ఎం), నిఖత్‌ బాను, వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం) సెమీఫైనల్లో అడుగు పెట్టారు.

క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో మోనిక 4–0తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, నిఖత్‌బాను 4–0తో సస్య (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్‌ 4–0తో భవిత (జీఎస్‌ఎం)పై విజయం సాధించారు. యూత్‌ బాలికల విభాగంలో జి. ప్రణీత (హెచ్‌వీఎస్‌), ఎన్‌. భవిత (జీఎస్‌ఎం), బి. రాగ నివేదిత (జీటీటీఏ), వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో ప్రణీత 4–0తో హనీఫా ఖాటూన్‌ (వీపీజీ)పై, భవిత 4–2తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, రాగ నివేదిత 4–1తో వినిచిత్రపై, వరుణి జైస్వాల్‌ 4–1తో సస్య (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు