విజేతలు స్నేహిత్, ప్రణీత, జతిన్‌ దేవ్‌

17 Oct, 2019 10:23 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్టాగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ (జీటీటీఏ), జి. ప్రణీత (హెచ్‌వీఎస్‌) సత్తా చాటారు. బండ్లగూడలోని మహావీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో వీరిద్దరూ పురుషులు, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. బుధవారం పురుషుల ఫైనల్లో స్నేహిత్‌ 11–0, 11–7, 6–11, 12–10, 6–11, 11–6తో అమన్‌ (సీఆర్‌ఎస్‌సీబీ)పై గెలుపొందాడు. మహిళల టైటిల్‌పోరులో ప్రణీత 11–7, 11–4, 14–12, 7–11, 8–11, 8–11, 11–7తో వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం)ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో వరుణి జైస్వాల్‌ 11–9, 11–9, 13–11, 11–7తో మోనిక (జీఎస్‌ఎం)పై, ప్రణీత (హెచ్‌వీఎస్‌) 11–7, 11–13, 11–9, 6–11, 12–10, 11–7తో నైనా జైస్వాల్‌ (ఎల్‌బీఎస్‌)పై, బి. అమన్‌ 11–5, 11–6, 6–11, 15–13, 11–5తో అమాన్‌ ఉర్‌ రహమాన్‌ (ఏవీఎస్‌సీ)పై, స్నేహిత్‌ 11–4, 11–1, 8–11, 11–5, 11–8తో సరోజ్‌ సిరిల్‌పై గెలుపొందారు.

క్యాడెట్‌ విభాగంలో జతిన్‌దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌), శ్రీయ (ఏడబ్ల్యూఏ) చాంపియన్‌లుగా నిలిచారు. ఫైనల్‌ మ్యాచ్‌ల్లో జతిన్‌ దేవ్‌ 6–11, 5–11, 11–8, 13–11, 11–4, 11–8తో ఆరుశ్‌ (ఏపీజీ)పై గెలుపొందగా... శ్రీయ 11–9, 11–4, 11–8, 11–8తో పి. జలాని (వీపీజీ)ని ఓడించింది. సబ్‌ జూనియర్‌ బాలుర ఫైనల్లో జషన్‌ సాయి (ఎంఎల్‌ఆర్‌) 11–3, 4–11, 11–3, 11–7, 11–9తో త్రిశూల్‌ మెహ్రా (ఎల్‌బీఎస్‌)పై నెగ్గాడు. బాలికల తుదిపోరులో గౌరి (ఎంఎల్‌ఆర్‌) 5–11, 7–11, 14–12, 13–11, 9–11, 11–4, 11–8తో పూజ (ఏడబ్ల్యూఏ)ను ఓడించింది. జూనియర్‌ కేటగిరీలో కేశవన్‌ కన్నన్‌ (ఎంఎల్‌ఆర్‌), ఎన్‌. భవిత విజేతలుగా నిలిచారు. ఫైనల్లో కేశవన్‌ M 7–11, 7–11, 12–10, 11–7, 8–11, 11–4, 11–4తో ప్రణవ్‌ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై, భవిత 11–3, 15–17, 11–9, 11–8, 11–13, 9–11, 11–5తో కీర్తన (హెచ్‌వీఎస్‌)పై గెలిచారు. యూత్‌ బాలుర ఫైనల్లో మొహమ్మద్‌ అలీ (ఎల్‌బీఎస్‌) 11–9, 5–11, 11–8, 11–3, 11–9తో స్నేహిత్‌పై గెలుపొందగా... బాలికల తుదిపోరులో రాగ నివేదిత  6–11, 4–11, 11–9, 11–9, 11–8, 9–11, 12–10తో నైనా జైస్వాల్‌ (ఎల్‌బీఎస్‌)ను ఓడించింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వింబుల్డన్‌కు బీమా ధీమా 

ఐపీఎల్‌ నష్టం రూ.3800 కోట్లు! 

చచ్చిపోయినా ఫర్వాలేదనుకున్నా!

మా దగ్గర సరిపడా డబ్బు ఉంది! 

ఆటలు, ఆతిథ్యం... 

సినిమా

కథలు వండుతున్నారు

దారి చూపే పాట

ఆర్‌ఆర్‌ఆర్‌లో..?

హీరోలకు అండగా ఉందాం

రెహమాన్‌కి కోపమొచ్చింది

సొంత హోట‌ల్‌నే ఇచ్చేసిన సోనూసూద్