యూత్‌ చాంప్స్‌ స్నేహిత్, వరుణి

9 Jul, 2019 13:53 IST|Sakshi

రాష్ట్ర ర్యాంకింగ్‌ టీటీ టోర్నీ   

సాక్షి, హైదరాబాద్‌: సెయింట్‌ పాల్స్‌ వార్షిక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో యూత్‌ బాలబాలికల విభాగాల్లో సూరావజ్జుల స్నేహిత్‌ (గ్లోబల్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీ), వరుణి జైస్వాల్‌ (గుజరాతి సేవా మండల్‌) చాంపియన్స్‌గా అవతరించారు. హైదర్‌గూడలోని సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌లో జరిగిన ఫైనల్స్‌లో స్నేహిత్‌ 11–6, 7–11, 11–7, 11–4, 11–9తో అమాన్‌ ఉర్‌ రెహ్మాన్‌పై... వరుణి 8–11, 8–11, 11–5, 11–9, 11–8, 11–3తో జి.ప్రణీత (హనుమాన్‌ వ్యాయామశాల)పై గెలిచారు. సెమీఫైనల్స్‌లో స్నేహిత్‌ 12–10, 11–7, 11–6, 11–8తో అరవింద్‌ (ఆనంద్‌నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌)పై, అమాన్‌ ఉర్‌ రెహ్మాన్‌ 11–6, 11–8, 9–11, 13–11, 14–12, 11–5తో మొహమ్మద్‌ అలీ (ఎల్బీ స్టేడియం)పై నెగ్గారు.

పురుషుల సింగిల్స్‌లో అమన్‌ బల్గు (సీఆర్‌ఎస్‌సీబీ), మహిళల సింగిల్స్‌లో నిఖత్‌ బాను (ఆర్‌బీఐ) టైటిల్స్‌ సాధించారు. ఫైనల్స్‌లో అమన్‌ 13–11, 11–9, 11–8, 13–15, 4–11, 12–10, 12–10తో మొహమ్మద్‌ అలీపై, నిఖత్‌ బాను 11–7, 11–9, 11–6, 5–11, 12–10తో వరుణి జైస్వాల్‌పై గెలుపొందారు. సెమీఫైనల్స్‌లో మొహమ్మద్‌ అలీ 11–7, 11–4, 11–7, 9–11, 10–12, 12–10, 11–5తో అమాన్‌ ఉర్‌ రెహ్మాన్‌పై, అమన్‌ 8–11, 11–9, 12–10, 7–11, 11–4, 11–8తో స్నేహిత్‌పై; నిఖత్‌ 11–3, 11–8, 7–11, 11–8, 9–11, 11–9తో మౌనిక (గుజరాతి సేవా మండల్‌)పై, వరుణి 4–11, 15–13, 6–11, 11–5, 11–9, 11–8తో జి.ప్రణీతపై విజయం సాధించారు.

జూనియర్‌ బాలుర విభాగంలో కేశవన్‌ కన్నన్‌ (ఎంఎల్‌ఆర్‌ అకాడమీ) విజేతగా నిలిచాడు. ఫైనల్లో కేశవన్‌ 8–11, 11–9, 5–11, 11–9, 12–10, 11–7తో బి.వరుణ్‌ శంకర్‌ (గ్లోబల్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీ)పై గెలిచాడు. సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ (ట్రాఫిక్‌) విద్యాసాగర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీటీఏ) ఉపాధ్యక్షుడు ఆనంద్‌ బాబా, కోశాధికారి ఇబ్రహీమ్‌ ఖాన్, సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బ్రదర్‌ రాయప్ప, కార్యనిర్వాహక కార్యదర్శి సంజీవ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా