స్నేహిత్‌కు కాంస్యం

27 Mar, 2014 00:07 IST|Sakshi

ఇండియా ఓపెన్ టీటీ
 జింఖానా, న్యూస్‌లైన్: గ్లోబల్ జూనియర్ అండ్ క్యాడెట్ ఇండియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో స్నేహిత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో తొలి పతకాన్ని అందుకున్నాడు. భారత్-బి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్నేహిత్ డబుల్స్‌లో జీత్ చంద్రతో కలిసి బరిలోకి దిగాడు.
 
  గోవాలో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్-బి 0-3తో సింగపూర్ చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో భారత్ 3-2తో స్వీడన్‌పై నెగ్గగా; రెండో మ్యాచ్‌లో 1-3తో భారత్-ఏ చేతిలో పరాజయం చవిచూసింది. మూడో మ్యాచ్‌లో భారత్-బి 2-3తో భారత్-సిపై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.
 

మరిన్ని వార్తలు