మూడో పాక్‌ క్రికెటర్‌గా..

23 Jun, 2019 20:19 IST|Sakshi

లండన్‌: పాకిస్తాన్‌ క్రికెటర్‌ హరీస్‌ సొహైల్‌ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సొహైల్‌(89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు‌) చెలరేగడంతో పాకిస్తాన్‌ 309 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించకల్గింది. ఈ క్రమంలోనే సొహైల్‌ దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో యాభైకి పైగా వ్యక్తిగత పరుగులు సాధించే క్రమంలో అత్యధిక స్టైక్‌రేట్‌ నమోదు చేసిన మూడో పాక్‌ క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు.

ఈ మ్యాచ్‌లో సొహైల్‌ స్టైక్‌రేట్‌ 150.84గా ఉంది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సొహైల్‌ ఆది నుంచి విజృంభించి ఆడాడు. 50కి పైగా పరుగుల్ని ఫోర్లు, సిక్సర్లతోనే సాధించాడు. దాంతో వరల్డ్‌కప్‌లో అత్యధిక స్టైక్‌రేట్‌ సాధించిన పాక్‌ ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. అంతకుముందు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక స్టైక్‌రేట్‌ నమోదు చేసిన పాక్‌ ఆటగాళ్లలో ఇమ్రాన్‌ ఖాన్ 169. 69స్టైక్‌ రేట్‌‌(1983, శ్రీలంకపై 33 బంతుల్లో 56 పరుగులు), ఇంజమాముల్‌ హక్‌ 162. 16(1992, 37 బంతుల్లో 60)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్థానాన్ని తాజాగా హరీస్‌ సొహైల్‌ ఆక్రమించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు