బౌల్డ్ పై డీఆర్ఎస్ కు వెళ్లాడు..

13 Mar, 2017 16:59 IST|Sakshi
బౌల్డ్ పై డీఆర్ఎస్ కు వెళ్లాడు..

గాలె: సాధారణంగా ఎల్బీలు, క్యాచ్లు వంటి అనుమానాస్పద నిర్ణయాల్లో మాత్రమే అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని క్రికెటర్లు కోరుతుంటారు. అయితే శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ ను సవాల్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతమైన నవ్వులు తెప్పించింది.  

శనివారం చివరి రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ ఆటగాడు సౌమ్య సర్కార్ బౌల్డ్ అయ్యాడు. శ్రీలంక మీడియం ఫాస్ట్ బౌలర్ గుణరత్నే బౌలింగ్ లో్ సౌమ్య సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే బౌల్డ్ అయిన విషయాన్ని పూర్తిగా చూడని సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ కు వెళ్లాడు. సౌమ్య సర్కార్  బౌల్డ్ అయ్యే క్రమంలో ఫీల్డ్ అంపైర్  కాస్త ఆలస్యంగా నిర్ణయం ప్రకటించడంతో  అసలు వికెట్ల వద్ద ఏమి జరిగిందో అనే విషయాన్ని అతను పట్టించుకోలేదు.  తన అవుట్ ను సవాల్ చేసే ముందు తాను ఎందుకు డీఆర్ఎస్ కు వెళ్లాల్సివచ్చిందో కనీసం తెలియకపోవడం అభిమానుల్లో నవ్వులు పూయించింది. ఆ మ్యాచ్ లో శ్రీలంక 259 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.