సూపర్‌ సౌరభ్‌

1 Dec, 2019 04:37 IST|Sakshi

సయ్యద్‌ మోదీ ఓపెన్‌లో

టైటిల్‌ పోరుకు అర్హత

సెమీస్‌లో ఓడిన రితూపర్ణ  

లక్నో: ఈ ఏడాది మూడో టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకునేందుకు భారత షట్లర్‌ సౌరభ్‌ వర్మ విజయానికి దూరంలో నిలిచాడు. సయ్యద్‌ మోదీ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌లో జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్‌ సౌరభ్‌ వర్మ 21–17, 16–21, 21–18తో ప్రపంచ 44వ ర్యాంకర్‌ హివో క్వాంగ్‌ హీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు.

75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 15–18తో వెనుకబడిన సౌరభ్‌ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకున్నాడు. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్, ప్రపంచ 22వ ర్యాంకర్‌ వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)తో సౌరభ్‌ ఆడతాడు.మరోవైపు మహిళల సింగిల్స్‌ విభాగంలో జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ ప్లేయర్‌ రితూపర్ణ దాస్‌ ని్రష్కమించింది. సెమీఫైనల్లో రితూపర్ణ దాస్‌ 22–24, 15–21తో ఫిట్టాయపోర్న్‌ చైవాన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదనంగా మరో రూ. 75 లక్షలు... కేంద్రానికి హాకీ ఇండియా విరాళం

థాయ్‌లాండ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్యపై వేటు

ధోనికి జీవా మేకప్‌

నెమార్‌ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు

ఇంగ్లండ్‌ క్రికెటర్ల దాతృత్వం

సినిమా

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు