హోం ఐసోలేషన్‌కు గంగూలీ

17 Jul, 2020 01:11 IST|Sakshi

సోదరుడు స్నేహాశీష్‌కు కరోనా పాజిటివ్‌ 

కోల్‌కతా: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) సంయుక్త కార్యదర్శి, గంగూలీకి సోదరుడైన స్నేహాశీష్‌ గంగూలీ బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో దాదా కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నాడు. బెంగాల్‌ మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అయిన స్నేహాశీష్‌ కొన్ని రోజులుగా  జ్వరంతో బాధపడుతున్నట్లు ‘క్యాబ్‌’ అధికారి ఒకరు తెలిపారు. అతనికి పాజిటివ్‌ రావడంతో నిబంధనల ప్రకారం గంగూలీ కూడా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండనున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా