సౌరబ్ గంగూలీ జోస్యం ఫలిస్తుందా?

8 Jul, 2014 03:00 IST|Sakshi
సౌరబ్ గంగూలీ జోస్యం ఫలిస్తుందా?
ప్రపంచ క్రీడాభిమానులందరికి ఫుట్ బాల్ ఫీవర్ పట్టుకుంది.  ప్రపంచ పుట్ బాల్ కప్ టోర్నిలో నాకౌట్ దశ ముగిసి సెమీఫైనల్ పోటీలకు జట్లు సిద్దమవుతున్నాయి. ఇక ఫైనల్ కు ఏ జట్లు చేరుతాయా అని అంచనాలు వేసుకోవడం, జోస్యం చెప్పడం పనిలో పడ్డారు.
 
పుట్ బాల్ అభిమానైన భారత  క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రపంచ కప్ పోటీలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే భారత సిరీస్ కోసం కామెంటేటర్ గా మారిన గంగూలీ ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫైనల్ పోటీల్లో ఏ జట్లు ఆడబోతున్నాయో.. ముందే ఓ అంచనాకు వచ్చాడు. జూలై 13న జరిగే ఫైనల్ మ్యాచ్ లో జర్మనీ, నెదర్లాండ్ జట్టు పోటీ పడుతాయని జోస్యం చెప్పాడు. 
 
ఓ ఫుట్ బాల్ అభిమానిగా బ్రెజిల్, అర్జెంటీనా జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటాను. కాని పుట్ బాల్ జట్ల ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే జర్మనీ, నెదర్లాండ్ జట్లు ఫైనల్ పోటీకి అర్హత సాధిస్తాయనిపిస్తోంది అని గంగూలీ అన్నారు. ఇక ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ ను జూలై 9 తేదిన ఆరంభం కానుంది. 

మరిన్ని వార్తలు