దాదానే మళ్లీ దాదా.. !

27 Sep, 2019 10:32 IST|Sakshi

కోల్‌కతా: క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మరోసారి ఎన్నికయ్యారు. ఈ రేసులో  గంగూలీ మాత్రమే ఉండటంతో అతని ఎంపిక లాంచనమైంది. దాంతో పాటు గంగూలీ ప్యానల్‌కు పోటీగా కూడా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో అతని ప్యానల్‌ ఏకగ్రీవంగా ఎంపికైంది.  గతవారం గంగూలీ ప్యానల్‌ నామినేషన్లు దాఖలు చేయగా, గురువారం ఈ ప్యానల్‌ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు క్యాబ్‌ ఎలక్ట్రోల్‌ ఆఫీసర్‌ ప్రకటించారు.

రేపట్నుంచి గంగూలీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప‍్యానల్‌ ఆఫీసు బ్యారర్‌లుగా బాధ్యతలను తీసుకోనుంది. 2015లో తొలిసారి గంగూలీ క్యాబ్‌ చీఫ్‌గా ఎన్నికయ్యాడు. ఆ మరుసటి ఏడాది జగన్మోహన్‌ దాల్మియా మరణంతో దాదా అధ్యక్షుడయ్యాడు. ఆఫీస్‌ బేరర్ల ఆరేళ్ల గరిష్ఠ పదవీకాల నిబంధన గంగూలీకి మరో పది నెలల్లోనే ముగియనుంది. దీంతో అతడు 2020 జూలైలో తప్పుకోవాల్సి ఉంటుంది.

 గంగూలీ ప్యానల్‌

ప్రెసిడెంట్‌: సౌరవ్‌ గంగూలీ; వైస్‌ ప్రెసిడెంట్‌: నరేశ్‌ ఓజా; సెక్రటరీ: అవిషేక్‌ దాల్మియా; జాయింట్‌ సెక్రటరీ: దేబాబ్రతా దాస్‌; ట్రెజర్‌: దేబాశిస్‌ గంగూలీ

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా