లవ్యూ దాదా.. గంగూలీ సెల్ఫీకి యమ క్రేజ్‌!

31 Oct, 2019 15:42 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అంటే ఆయన అభిమానులు పడిచస్తారు. క్రికెట్‌ నుంచి తప్పుకున్నా.. ఇప్పటికీ గంగూలీ క్రేజ్‌ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న గంగూలీ బుధవారం బెంగళూరు వెళ్లారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో చెకిన్‌ వద్ద ఆయనను చూసి అభిమానులు చుట్టుముట్టారు. తన పట్ల ఫ్యాన్స్‌ చూపిస్తున్న ప్రేమకు ముగ్ధుమైన గంగూలీ వారితో కలిసి ఒక గ్రూప్‌ సెల్పీ దిగారు. ఈ సెల్ఫీలో గంగూలీ ఫ్యాన్సే కాదు.. వెనుక ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా నవ్వులు చిందించడం చూడొచ్చు. ‘ఇది బెంగళూరు ఎయిర్‌పోర్టులో చెకిన్‌ వద్ద.. ప్రజల అభిమానానికి ఎంతో కృతజ్ఞుడిని’ అంటూ గంగూలీ ఈ సెల్ఫీ ట్వీట్‌ చేశారు. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇప్పటికే దాదాపు 82వేలమంది ఈ సెల్ఫీని లైక్‌ చేశారు. 4800లకుపైగా రీట్వీట్‌ చేశారు. లవ్యూ దాదా.. నిన్ను చూసి మేం గర్విస్తున్నాం. క్రికెట్‌లో నువ్వెప్పుడూ బాస్‌వే అంటూ అభిమానులు ఈ సెల్ఫీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు