'క్యాబ్' చీఫ్ గా గంగూలీ

24 Sep, 2015 20:23 IST|Sakshi
'క్యాబ్' చీఫ్ గా గంగూలీ

కోల్ కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గంగూలీ నియమకాన్నిపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఖరారు చేశారు. అంతకుముందు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా మృతితో ఆ స్థానం ఖాళీ అయ్యింది. 

 

దాల్మియా వారసుడిగా ఎవరూ ఎదగలేకపోవడంతో పరిస్థితి కొంతమేర సంక్లిష్టంగా కనిపించింది. అయితే చాలా మంది సౌరవ్ గంగూలీ పేరును సూచించారు. అంతకుముందు ‘క్యాబ్’ సంయుక్త కార్యదర్శి హోదాలో సౌరవ్ ఉన్నా.. అతనికి అనుభవం తక్కువ అనే అభిప్రాయం వినిపించింది.  వీటన్నింటికీ తెరదించుతూ సీఏబీ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు మమత ప్రకటించారు. మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న గంగూలీ.. అదే తరహాలో బెంగాల్ క్రికెట్ ను కూడా ముందుకు తీసుకువెళతారని మమత ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు దాల్మియా కుమారుడు అభిషేక్ కు 'క్యాబ్'లో కీలక పదవి దక్కే అవకాశం కనబడుతోంది.

మరిన్ని వార్తలు