నేడు బీసీసీఐ ఏజీఎం

23 Oct, 2019 02:38 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నేడు జరుగుతుంది. అనంతరం ఎన్నికయిన నూతన కార్యవర్గం బోర్డులో పూర్తిస్థాయి పాలన పగ్గాలు చేపడుతుంది. దీంతో సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ)కి నేటితో శుభం కార్డు పడుతుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన వివాదాస్పదం కాకుండా సజావుగానే ముగిసింది. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా కార్యదర్శి పదవికి నామినేషన్‌ వేశారు. మరోవైపు ఇన్నాళ్లు భారత క్రికెట్‌ వ్యవహరాలు చూసిన సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీలకు 33 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు