సఫారీలకు సంతోషం

30 Dec, 2019 01:19 IST|Sakshi

తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై 107 పరుగులతో గెలుపు

ఐదు ఓటముల తర్వాత మొదటి విజయం  

సెంచూరియన్‌: సొంతగడ్డపైనే శ్రీలంకలాంటి జట్టు చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి. భారత్‌లో ఆడిన సిరీస్‌లో 0–3తో చిత్తయితే ఇందులో రెండు ఇన్నింగ్స్‌ పరాజయాలు. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం, తప్పుకున్న టీమ్‌ ప్రధాన స్పాన్సర్‌. ఇలా వేగంగా పతనమైపోతూ వచ్చిన దక్షిణాఫ్రికా క్రికెట్‌కు కాస్త ఊరట! దిగ్గజ క్రికెటర్లు గ్రేమ్‌ స్మిత్, మార్క్‌ బౌచర్, జాక్వస్‌ కలిస్‌ టీమ్‌ డైరెక్టర్, కోచ్, సలహాదారుల పాత్రలోకి వచి్చన తర్వాత బరిలోకి దిగిన మొదటి పోరులోనే ఆ జట్టు విజయాన్ని రుచి చూసింది. ఆదివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 376 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 121/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ ఒక దశలో 204/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 64 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. రోరీ బర్న్స్‌ (154 బంతుల్లో 84; 11 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ జో రూట్‌ (48) మాత్రమే కొద్దిగా పోరాడాడు. సఫారీ పేస్‌ బౌలర్లు రబడ 4, నోర్జే 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో నిలవగా... జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో రెండో టెస్టు జరుగుతుంది. తాజా విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌íÙప్‌ పాయింట్ల పట్టికలో కూడా డు ప్లెసిస్‌ సేన ఖాతా తెరిచింది. ఈ గెలుపు అనం తరం దక్షిణాఫ్రికాకు 30 పాయింట్లు లభించాయి.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా