ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేశారు..

8 Mar, 2020 11:03 IST|Sakshi

పాచెఫ్‌స్టర్‌రూమ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా వైట్‌వాష్‌ అయ్యింది. నిన్న జరిగిన చివరి వన్డేలో ఆసీస్‌ పరాజయం పాలై సిరీస్‌ను 3-0తో కోల్పోయింది. కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలుద్దామనుకున్న ఆసీస్‌కు చుక్కెదురైంది. తొలుత ఆసీస్‌ను కట్టడి చేసిన సఫారీలు.. ఆపై సునాయాసంగా విజయాన్ని అందుకున్నారు. దాంతో సిరీస్‌ను సఫారీలు క్లీన్‌స్వీప్‌ చేశారు. ఆఖరి వన్డేలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. (కరోనా భయం లేదు: సీఎస్‌ఏ)

లబూషేన్‌(108) తన వన్డే కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత డీఆర్సీ షాట్‌(36), మిచెల్‌ మార్ష్‌(32)లు మాత్రమే మోస్తరుగా ఆడారు. దాంతో ఆసీస్‌ 255 పరుగుల టార్గెట్‌ను మాత్రమే దక్షిణాఫ్రికాకు నిర్దేశించింది. సఫారీ బౌలర్లలో నోర్త్‌జీ, స్మట్స్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, డుపావిలియన్‌, ఫెహ్లక్వోయో చెరో వికెట్‌ తీశారు.అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. స్మట్స్‌(84), విర్రెన్నె(50), క్లాసన్‌(68 నాటౌట్‌)లు సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ వన్డే సిరీస్‌లోఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు సాధించిన క్లాసెన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది. అంతకుముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆసీస్‌ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. (‘ఫ్రీగా ఫైనల్‌ వెళ్లడం కంటే ఓడిపోవడమే బెటర్‌)

మరిన్ని వార్తలు