మైదానంలో సఫారీ డ్రోన్

3 Jul, 2015 00:04 IST|Sakshi
మైదానంలో సఫారీ డ్రోన్

అడ్డుకున్న బంగ్లా బోర్డు  
 క్షమాపణ చెప్పిన దక్షిణాఫ్రికా జట్
టు
 
 ఢాకా: తమ ప్రాక్టీస్ సెషన్‌లో డ్రోన్‌ను ఉపయోగించిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ మిలిటరీకి గురువారం క్షమాపణలు చెప్పింది. ఏరియల్ వ్యూ నుంచి ఆటగాళ్ల ఫొటోలను, వీడియోలను తీసేందుకు బుధవారం నాటి సెషన్‌లో ఈ డ్రోన్‌ను ఉపయోగించారు. అయితే జాతీయ భద్రతా చర్యల కింద బంగ్లాలో ఇలాంటివి వాడడం నిషేధం. విషయం తెలిసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు వెంటనే తమ అభ్యంతరాన్ని తెలిపి అడ్డుకున్నారు.
 
 ‘జట్టుతో పాటు వచ్చిన ‘బిహైండ్ ది సీన్’ టీవీ సిబ్బంది తమ యూట్యూబ్ చానెల్ కోసం వీడియోలు, సృజనాత్మక ఫొటోల కోసం డ్రోన్‌ను వాడారు. అయితే బంగ్లాదేశ్ గగనతలంపై  ఇలాంటి వాటిని నిషేధించిన విషయం మాకు తెలీదు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి వెంటనే దాన్ని ఉపయోగించడం మానేశాం’ అని ప్రొటీస్ టీమ్ మేనేజర్ మొహమ్మద్ మూసజీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు