ఆమ్లా స్థానం పదిలం 

19 Apr, 2019 05:17 IST|Sakshi

డర్బన్‌: కొంతకాలంగా ఫామ్‌లో లేకపోయిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణాఫ్రికా సెలెక్టర్లు హషీమ్‌ ఆమ్లా వైపు మొగ్గు చూపారు. ప్రపంచకప్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో ఆమ్లాను ఎంపిక చేశారు. ఇప్పటివరకు 174 వన్డేలు ఆడిన ఆమ్లా 27 సెంచరీలు, 37 అర్ధ సెంచరీల సహాయంతో 7910 పరుగులు సాధించాడు. అయితే గత 17 ఇన్నింగ్స్‌లో అతను ఒక సెంచరీ మాత్రమే చేయడంతో ఆమ్లాకు ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కుతుందా లేదా అనే సందేహం కలిగింది. 2015 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఏబీ డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఈసారి వరల్డ్‌ కప్‌లో
ఫాఫ్‌ డు ప్లెసిస్‌ దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. 

దక్షిణాఫ్రికా జట్టు: డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), క్వింటన్‌ డి కాక్‌ (వికెట్‌ కీపర్‌), ఆమ్లా, మార్క్‌రమ్, డసెన్, డేవిడ్‌ మిల్లర్, డుమిని, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, స్టెయిన్, రబడ, ఇన్‌గిడి, యాన్రిచ్‌ నోర్తె, ఇమ్రాన్‌ తాహిర్, షమ్సీ.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా