ఆచితూచి ఆడుతున్న సఫారీలు

11 Oct, 2015 10:08 IST|Sakshi
ఆచితూచి ఆడుతున్న సఫారీలు

కాన్పూర్: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా  జట్టు ఒక్క వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆదివారం జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టు ఓపెనర్ ఆమ్లా 16పరుగులు (24 బంతులు, 2 ఫోర్లు), డుప్లెసిస్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 29 పరుగులు(33 బంతులు, 5 ఫోర్లు) చేసి జట్టు స్కోర్ 45 వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగాడు.  తొలి నాలుగు ఓవర్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో రెండు ఫోర్లు బాది డికాక్ ప్రమాద సంకేతాలు పంపించాడు. కానీ ఆమ్లా మాత్రం రన్స్ చేయడానికి ఇబ్బందిపడ్డాడు.

ధోనీ నమ్ముకున్న స్పిన్ అటాక్ మంత్రం ఫలించింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అశ్విన్ చేతికి కెప్టెన్ ధోని బంతిని అందించాడు.  అదే ఓవర్లో ఫస్ట్ స్లిప్లో రైనా అందుకున్న చక్కని క్యాచ్తో జోరుమీదున్న డికాక్ను పెవిలియన్ బాటపట్టాడు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక్క వికెట్ తీశాడు. భువీ 5 ఓవర్లు వేసి 21 పరుగులివ్వగా, ఉమేశ్ కూడా వికెట్లేమీ తీయకుండా 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చాడు.

మరిన్ని వార్తలు