భారత్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

22 Sep, 2019 22:33 IST|Sakshi

బెంగుళూరు: మూడో టీ20లో విజయం సాధించి సిరీస్‌ సొం‍తం చేసుకోసుకోవాలనుకున్న టీమిండియాకు సఫారీలు షాకిచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం  జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్‌ ధావన్‌ 36, రిషభ్‌ పంత్ 19, రవీంద్ర జడేజా 19 టాప్‌ స్కోరర్లు.

అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన దక్షిణాఫ్రికా కేవలం వికెట్‌ (రీజా హెన్రిక్స్‌ 28) మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ క్వింటన్ డీకాక్ 79 (6 బౌండరీలు, 5 సిక్సర్లు) తో విరుచుకుపడ్డాడు. అతనికి తోడు వన్డౌన్ బ్యాట్స్‌మన్ బావుమా (27) చెలరేగడంతో పర్యాటక జట్టు మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా) తీసిన బ్యూరెన్‌ హెన్రిక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. క్వింటన్ డీకాక్ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా ఎంపికయ్యాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బట్లర్‌ జెర్సీకి రూ. 61 లక్షల 30 వేలు

సాయిప్రణీత్‌ విరాళం రూ. 4 లక్షలు

అంతా బాగుంటే... ఆఖర్లో ఐపీఎల్‌: నెహ్రా

కెనడా ఎఫ్‌1 గ్రాండ్‌ప్రి కూడా వాయిదా

విజ్డన్‌ అత్యుత్తమ క్రికెటర్‌గా స్టోక్స్‌

సినిమా

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం

నిర్మాత కరీమ్‌కు కరోనా

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట