96 ఏళ్ల 'ట్రిపుల్‌ ' రికార్డు బ్రేక్‌

27 Nov, 2017 11:27 IST|Sakshi

ఈస్ట్‌ లండన్(దక్షిణాఫ్రికా)‌: ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 96 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డు తాజాగా బద్దలైంది. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో మరైస్‌ 191 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. తద్వారా క్రికెట్‌ చరిత్రలోనే 200 బంతుల్లోపు త్రిశతకం సాధించిన తొలి ఆటగాడిగానూ నిలిచాడు. ఈ క్రమంలోనే 1921లో చార్లెస్‌ మెకార్ట్‌నే (221 బంతుల్లో) నెలకొల్పిన వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ రికార్డును తుడిచిపెట్టాడు. 68 బంతుల్లో శతకం.. 139 బంతుల్లో డబుల్‌ సెంచరీ అందుకున్నాడు.

ఆదివారం జరిగిన మూడు రోజుల కప్‌ మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ తమ బోర్డర్‌ జట్టు 84/4 స్కోరుతో కష్టకాలంలో ఉన్న దశలో ఆరో నంబర్‌ ఆటగాడిగా బరిలోకి దిగిన మార్కో 35 ఫోర్లు, 13 సిక్సర్లతో 191 బంతుల్లో 300 పరుగులు పూర్తి చేశాడు.

మరిన్ని వార్తలు