రబడ అప్పీలుపై 19న విచారణ

17 Mar, 2018 04:29 IST|Sakshi

కేప్‌టౌన్‌: రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురైన దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసొ రబడ అప్పీలుపై సోమవారం (ఈ నెల 19న) విచారణ జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తెలిపింది. న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్‌ లాయర్‌ హెరాన్‌ను జ్యూడిషియల్‌ కమిషనర్‌గా ఐసీసీ నియమించింది. ఆయన టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా రబడ వాదన వింటారు. ఈ విచారణ ముగిసిన 48 గంటల్లో కమిషనర్‌ తుది నిర్ణయం తీసుకుంటారు. దీంతో మూడో టెస్టులోపే రబడ ఆడేది లేనిది తెలిసిపోతుంది. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టు న్యూలాండ్స్‌లో గురువారం మొదలవుతుంది. రెండో టెస్టులో ప్రత్యర్థి కెప్టెన్‌ స్మిత్‌తో రబడ దురుసుగా ప్రవర్తించడంతో మ్యాచ్‌ రిఫరీ అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు.  

ఐర్లాండ్‌పై జింబాబ్వే గెలుపు
హరారే: ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ సూపర్‌ సిక్స్‌లో జింబాబ్వే ముందంజ వేసింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగా... ఐర్లాండ్‌ 34.2 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సికందర్‌ రజా (69 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), బౌలింగ్‌లో క్రీమర్‌ (3/18) రాణించారు. 

మరిన్ని వార్తలు