బ్యాడ్మింటన్‌లో డబుల్‌ ధమాకా

3 Dec, 2019 01:07 IST|Sakshi

భారత జట్లకు స్వర్ణాలు

పొఖార (నేపాల్‌): దక్షిణాసియా క్రీడల్లో తొలి రోజు భారత్‌కు ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు టీమ్‌ విభాగంలో విజేతగా నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి. పురుషుల టీమ్‌ ఫైనల్లో భారత్‌ 3–1తో శ్రీలంకపై... మహిళల టీమ్‌ ఫైనల్లో భారత్‌ 3–0తో శ్రీలంకపై నెగ్గాయి. భారత్‌ తరఫున రెండు సింగిల్స్‌లో  శ్రీకాంత్, సిరిల్‌ వర్మ గెలిచారు. డబుల్స్‌ మ్యాచ్‌లో అరుణ్‌ జార్జి–సాన్యమ్‌ శుక్లా జంట ఓడిపోగా... మరో డబుల్స్‌ మ్యాచ్‌లో గారగ కృష్ణ ప్రసాద్‌–ధ్రువ్‌ కపిల జంట నెగ్గడంతో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. భారత మహిళల జట్టు తరఫున రెండు సింగిల్స్‌లలో తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, పుల్లెల గాయత్రి గెలుపొందగా... డబుల్స్‌ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–మేఘన జంట నెగ్గి పసిడి పతకాన్ని అందించారు. మరోవైపు పురుషుల ట్రయాథ్లాన్‌ వ్యక్తిగత విభాగంలో ఆదర్శ సినిమోల్‌ స్వర్ణం సాధించాడు. తైక్వాండోలో పురుషుల అండర్‌–29 పోమ్సె పెయిర్‌ ఈవెంట్‌లో, అండర్‌–23 పోమ్సె టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణాలు లభించాయి.

మరిన్ని వార్తలు